టాలీవుడ్ లో హీరోయిన్ సమంతకు బెస్ట్ ఫ్రెండ్ సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీ పాద అని అందరికి తెలిసిందే. సమంత సినిమాలకు ఈమె తెలుగు డబ్బింగ్ చెబుతుండటంతో వీరిద్దరి పరిచయం మొదలై, అది కాస్త ఫ్రెండ్ షిప్ గా మారి, ఫైనల్ గా వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. సమంత,చిన్మయి కలిసి తరుచుగా పలు ఛారిటీ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అయితే సమంతకు కేవలం చిన్మయి తో మాత్రమే కాదు, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది..
అయితే రాహుల్ రవీంద్రన్ టాలీవుడ్ కు యాక్టర్ గా పరిచమై, ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలనే రాహుల్ రవీంద్రన్ ఖుషి సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ సమంత కు ఒక విమెన్ ఓరియెంటెడ్ సినిమా కథ ను చెప్పాడట. సమంత కు కథ బాగా నుంచి సినిమా చేద్దాం అని మాట కూడా ఇచ్చిందట. కానీ తీరా ఇప్పుడు చూస్తే ఆమె ఆరోగ్య కారణాల దృష్ట్యా మరి కొన్ని రోజులు డాక్టర్స్ రెస్ట్ కావాలని చెప్పడంతో ఆమె రాహుల్ కు హ్యాండ్ ఇచ్చి సినిమా చేయలేనని చెప్పిందట. దాంతో రాహుల్ ఇప్పుడే అదే సినిమాను రష్మిక తో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు..!!