ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే బాలీవుడ్ భామ కృతిసనన్ కూడా మిమి చిత్రానికి జాతీయ పురస్కారం అందుకుంది. దీంతో బన్నీ అండ్ కృతి సోషల్ మీడియా ద్వారా ఒకర్ని ఒకరు అభినందించుకున్నారు. ఈక్రమంలోనే కృతి చేసిన ఒక పోస్ట్..నెట్టింట తెగ వైరల్ అవుతుంది. “ఇద్దరు కలిసి నటించే సినిమా కోసం సిద్ధంగా ఉన్నా. నా ఫేవరెట్ సుకుమార్ గారితో కలిసి పుష్ప 2 చూసేందుకు నేను ఎదురు చూస్తున్నాను” అని ట్వీట్ చేసింది. వీరిద్దరి జంట స్క్రీన్ పై చాలా ఫ్రెష్ గా ఉంటుందని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాగా అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలను త్రివిక్రమ్, సందీప్ వంగ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రాబోతున్నాయి అని బన్నీ తెలియజేశాడు. వీటిలో ఏదొక చిత్రంలో అయితే కృతి ఎంపిక అయ్యే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ గ ఆదిపురుష్ లో సీత గ చేసింది కృతి తెలుగు ఇండస్ట్రీలోనే కెరీర్ స్టార్ట్ చేసింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘1 నేనొక్కడినే’ చిత్రంలో, ఆ తరువాత నాగచైతన్య ‘దోచేయ్’ సినిమాలో కూడా నటించింది. రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..!!