in

HEROINE WHO KISSED AKKINENI ON THE STAGE!

లాటరీ పద్ధతి లో అక్కినేని నాగేశ్వర రావు రావు సరససన హీరోయిన్ అవకాశం దక్కించుకున్న జయచిత్ర గారు. మాములుగా స్టోరీ డిమాండ్ చేసిందనో, హీరో డిమాండ్ చేశారనో, లేక డైరెక్టర్ గారి ఛాయస్ అనో హీరోయిన్ సెలక్షన్ జరుగుతుంది , అందుకు భిన్నంగా ” రావణుడే రాముడైతే” అనే చిత్రం కోసం హీరోయిన్ ని సెలెక్ట్ చేయటం కోసం లాటరీ తీశారు అందులో జయ చిత్ర గారి పేరు సెలెక్ట్ కావటంతో ఆ అవకాశం దక్కించుకున్నారు. అక్కినేని గారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా చిత్ర నిర్మాత మీర్జా పురం రాజా గారు అక్కినేని గారికి మద్రాసు నగరం లోని వాణీ మహల్ లో స్వాగత సత్కారం ఏర్పాటు చేసి, వారు తీయబోయే చిత్రం గురించి కూడా ప్రకటించారు. అందులో నటించబోయే హీరోయిన్ ను లాటరీ పద్దతిలో సెలెక్ట్ చేయదలచినట్లు ప్రకటించి, జయసుధ, జయప్రద,జయ చిత్ర వంటి సమకాలీన హీరోయిన్స్ పేర్లు వ్రాసి లాటరీ తీశారు..

అనూహ్యంగా జయచిత్ర గారి పేరు రావటం తో అక్కినేని గారి సరసన నటించే అవకాశం జయచిత్ర గారు దక్కించుకున్నారు. ఎంతో ఉత్కంఠ గ సాగింది ఈ లాటరీ కార్యక్రమం, జయ చిత్ర గారు సంతోషం తో ఉప్పొంగిపోయారు, అక్కినేని గారిని గట్టిగ కౌగిలించుకొని, స్టేజి మీదే ముద్దు పెట్టారు. అక్కడ ఉన్న వారందరు ఒకింత ఆశ్ఛర్య పోయిన, జయ చిత్ర గారి చిన్న పిల్ల వంటి మనస్తత్వం తెలిసిన అక్కినేని గారు మాత్రం లైట్ గ తీసుకున్నారు. నిజమే అంత మంది హీరోయిన్లకు దక్కని అవకాశం తనకు దక్కింది అన్న సంతోషం లో ఆమె ఆలా చేయటం పెద్ద తప్పుగా భావించ లేదు ఎవరు, జయ చిత్ర గురించి తెలిసిన వారెవరు అదొక పెద్ద తప్పుగా భావించలేదు. ఇప్పటిలాగా సోషల్ మీడియా కూడా లేదు ట్రోలింగ్స్ చేయటానికి కాబట్టి బతికిపోయాడు..!!

hot beauty dimple hayathi on board for balakrishna’s next!

young hero Sharwanand to romance Pooja Hegde!