in

bhola effect, sai pallavi and keerthy suresh’s mixed reactions!

భోళా శంకర్’ సినిమాలో చెల్లెలి పాత్ర కోసం తొలుత సాయి పల్లవినే అనుకున్న సంగతి తెలిసిందే. రీమేక్ సినిమా కావడం వల్ల సాయి పల్లవి నో చెప్పేసింది. అప్పట్లో చిరంజీవికి నో చెప్పిన సాయి పల్లవి అంటూ ఆమెని టార్గెట్ చేసేశారు కూడా కొందరు మెగా అభిమానులు. అయితే, తాజాగా ‘భోళా శంకర్’ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో, సాయి పల్లవి పండగ చేసుకుంటోందట.. అంటూ ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. సాయి పల్లవి కాదు, కీర్తి సురేష్..అనవసరంగా తప్పు చేశానంటూ సన్నిహితుల వద్ద వాపోతోందట అంటూ ఇంకో ప్రచారం తెర పైకి వచ్చింది.

వీళ్లిద్దరూ కాదు, కొరటాల శివ పండగ చేసుకుంటున్నాడంటూ ఇంకో ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ‘ఆచార్య’ ఫెయిల్యూర్ విషయంలో తప్పంతా నాదే అన్నారు.. ఇప్పుడేమంటారు.? అన్నట్లుగా కొరటాల సన్నిహితుల వద్ద ప్రస్థావిస్తున్నాడట అనేది ఈ ప్రచారం తాలూకు సారాంశం. ఏది ఏమైతేనేం, ఇలాంటి ప్రచారాలన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాంటివి వస్తుంటాయ్. పోతుంటాయ్. సినిమాలకు సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి కూడా అంతే..అయితే, చిరంజీవి సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలకు పెద్దగా నష్టమైతే వుండదు..!!

Rajinikanth Explains Why He Touched up cm Yogi Adityanath’s Feet!

Agent beauty Sakshi Vaidya grabs Ustaad Bhagat Singh!