ఇటీవల ఆదిపురుష్ కూడా డిజాస్టర్ కావడంతో బాలీవుడ్ దర్శకులతో ఇప్పట్లో సినిమాలు చేయకూడదు అని ప్రభాస్ ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. అయితే ప్రభాస్ కోసం మళ్లీ మైత్రి మూవీ మేకర్స్ మరో దర్శకుడిపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. విజయ్ తో లియో సినిమాను చేసిన దర్శకుడు లోకేష్ అయితే బాగుంటుందని నిర్మాతలు ఇటీవల ప్రభాస్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇంకా కథ ఫైనల్ కాలేదు కానీ ఈ కాంబినేషన్ ను కలిపేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నట్లు అయితే టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక కల్కి సినిమాతో పాటు మారుతి ప్రాజెక్టును కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇక లిస్టులో సందీప్ రెడ్డివంగా స్పిరిట్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక వీటితోపాటు హను రాఘవపూడి తో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ లోకేష్ మంచి కథతో వస్తే మాత్రం ప్రభాస్ ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి..!!