సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం జైలర్. ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ, తెలుగు భాషల్లో ఆగస్టు 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓ ప్రెస్మీట్లో పాల్గొన్నారు రజనీకాంత్. ఈ సందర్భంగా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పారు.
ఒకప్పుడు తాను మద్యం తాగేవాడినని అన్నారు. మద్యం సేవించడమే తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని చెప్పుకొచ్చారు. మద్యం తాగడం వల్లే ఆరోగ్యం, ఆనందం రెండింటిపై ప్రభావం పడిందని అన్నారు. ఒకవేళ మద్యం తాగకపోయి ఉంటే ఈ రోజు జీవితంలో ఇంతకంటే పెద్ద స్టార్‌గా ఉండేవాడినని అన్నారు. అందుకే మద్యపానానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని ఈ సందర్భంగా అభిమానులను కోరారు రజనీకాంత్…!!