తాజాగా ‘స్పై’ మూవీ నిర్మాత – హీరో నిఖిల్ మధ్య మూవీ రిలీజ్ పై అసలు సమస్య తలెత్తింది. ఈ నెలాఖరికి సినిమా రిలీజ్ వద్దని అంటున్నాడు నిఖిల్. ఎందుకంటే ప్రమోషన్ కు టైం సరిపోదు. కాబట్టి పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందనేది నిఖిల్ వాదన. అటు నిర్మాత ఈక్వేషన్స్ మరో విధంగా ఉన్నాయి. అదేంటంటే ఈ సినిమాను ఇంతకుముందు ప్రకటించిన తేదీకి కచ్చితంగా రిలీజ్ చేయాలి. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను భారీ మొత్తానికి దక్కించుకుంది. ఒకవేళ సినిమా విడుదల కనుక ఇప్పుడు వాయిదా పడితే అమెజాన్ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం నిర్మాతకు భారీగా నష్టం వస్తుంది..
అందుకే విడుదల తేదీని వాయిదా వేయడానికి నిర్మాత ఏమాత్రం ఇష్టపడడం లేదు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ ని కూడా విడుదల చేశారు. జూన్ 29న థియేటర్స్‌లోకి వస్తున్నామంటూ ఆ సాంగ్‌లో మరోసారి ప్రకటించారు. కానీ సాంగ్ రిలీజ్ వ్యవహారానికి సంబంధించి నిఖిల్ దూరంగా ఉన్నాడు. కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. దీంతో నిర్మాత మాత్రం జూన్ 29న సినిమా విడుదల చేయాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది..!!