in

Hansika: popular hero tortured me for a date

దేశముదురు హీరోయిన్​ హన్సిక మోత్వానీ  షాకింగ్​ విషయాలు బయట పెట్టింది.  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తనను ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో వేధించాడంటూ సంచలన విషయాన్ని చెప్పింది. తనతో డేట్​కి రావాలంటూ తరచూ వెంటపడేవాడని వేధించే వాడని తెలిపింది. ఆ టార్చర్​భరించలేక ఆ హీరోకి తగిన విధంగా బుద్ధి చెప్పినట్టు పేర్కొంది.  అయితే, ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం హన్సిక వెల్లడించలేదు. దీంతో హన్సికను ఇంతలా ఇబ్బంది పెట్టిన ఆ టాలీవుడ్​ హీరో ఎవరై ఉంటారని.. నెటిజన్లలో కొత్త చర్చ మొదలైంది.

ముంబైకి చెందిన ఓ బిజినెస్​ మ్యాన్​ను వివాహం చేసుకున్న హాన్సిక అక్కడే సెటిలైంది. పెళ్లి అయిన తర్వాత కూడా ఈ అమ్మడు సినిమా అవకాశాలు  అందుకుంటోంది. కోలీవుడ్ లోనూ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.  దేశముదురు సూపర్ హిట్ కావడంతో హాన్సికకు తెలుగు సినిమాల్లోనూ వరుస ఆఫర్లు వచ్చాయి.  టాప్ హీరోలందరితో హన్సిక నటించింది.  తెలుగులో కంటే తమిళ్‌ లో ఎక్కువ సినిమాల్లో ఆడిపాడింది….!!

happy birthday k RAGHAVENDRA RAO!

rajinikanth: sarath babu Would Snatch my Cigarette!