in

Young Sensation sreeleela comments about Her Stardom!

ప్పుడు తెలుగులో శ్రీ లీల క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అందరి సినిమాల్లోనూ ఆమె కనబడుతోంది. ఇంకా బోలెడు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ సమయంలో శ్రీ లీల ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళకూడదని భావిస్తున్నట్లు ఉన్నారు. ఆచి తూచి మాట్లాడుతున్నారు. కమర్షియల్ సినిమాల్లో కథానాయికలకు ప్రాముఖ్యం చాలా తక్కువ ఉంటుందని కొంత మంది నుంచి ఎప్పుడూ వినిపించే విమర్శ. ఈ ప్రస్తావన శ్రీ లీల దగ్గర తీసుకు రాగా..

”మనమంతా నిజాయతీగా మాట్లాడుకుందాం! ఇవాళ్టికి, ఈ రోజుకూ హీరోలను చూసే ప్రేక్షకులు రిలీజ్ డే టికెట్స్ కొంటున్నారు. చిత్రసీమలో నేను కొత్తగా అడుగు పెట్టిన కథానాయికని. సినిమా అంతా నేనే కనిపించాలని, నేను స్పాట్‌లైట్‌లో ఉండాలని చెప్పలేను. సినిమాకు వేల్యూ యాడ్ చేసే క్యారెక్టర్స్, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే రోల్స్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు” అని శ్రీ లీల చెప్పారు. పరోక్షంగా కమర్షియల్ సినిమాల్లో కథానాయిక పాత్రలు తనకు ఇష్టమేనని ఇండస్ట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..!

Case booked against Tollywood actress Dimple Hayathi!

happy birthday k RAGHAVENDRA RAO!