in

interesting: Samantha’s movie with Siddhu Jonnalagadda?

విడాకుల తర్వాత సమంత చేస్తున్న ప్రాజెక్టులు ఏవీ పెద్దగా ఆమెకు కలిసి రావడం లేదు. ప్రస్తుతానికి సమంత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మరోపక్క హిందీ లో బాలీవుడ్ హీరో వరుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సైటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఇక ఆ తర్వాత ఆమె ఎవరితో సినిమా చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఆసక్తికరమైన కాంబినేషన్ ఒకటి తెరమీదకు వచ్చింది. అదేమిటంటే సిద్దు జొన్నలగడ్డ హీరోగా సమంత హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందని అంటున్నారు.

సమంత స్నేహితురాలు దర్శకురాలు నందిని రెడ్డి ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన రామ్ తాళ్లూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది..అయితే సమంత నాగచైతన్య కాంబినేషన్లో కూడా నందిని రెడ్డి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినట్లు కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. కానీ బహుశా ఇప్పుడు నాగచైతన్య ప్లేసులోకి సిద్ధూ జొన్నలగడ్డ వచ్చి ఉండవచ్చని ప్రచారం కూడా జరిగింది..!!

Varun Tej and Lavanya Tripathi to get engaged in June 2023??

inside Talk: ‘Dhee 2’ Completely Shelved