మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి, అలాగే ఇప్పుడు హాలీవుడ్ లోనూ హల్చల్ చేస్తున్న ప్రియాంక చోప్రాకి టైం దొరకటం లేదుట. దేనికి అంటే రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడటానికి. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్లు కథానాయకులుగా వేశారు. ఇంతవరకు ఈ సినిమా నేను చూడలేదు, ఎందుకంటే నాకు అస్సలు టైం దొరకటం లేదు ఈ సినిమా చూడటానికి, అని చెప్పింది ప్రియాంక చోప్రా, ఒక సినిమా ప్రొమోషన్ లో భాగంగా. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ కూడా ఆమెని ట్రోల్ చేస్తున్నారు..అయితే ఆమె ఈ సినిమా గురించి ఇలా మాట్లాడటం, ట్రోల్ చెయ్యబడటం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఒకసారి ఆమె ‘ఆర్ఆర్ఆర్’ ని తమిళ సినిమా అనింది. ఆ తరువాత ఆ హోస్ట్ తమిళ సినిమా కాదు, బాలీవుడ్ సినిమా అన్నాడు. ఇద్దరిదీ తప్పే..!!