in

Balakrishna Next With Waltair Veerayya’s Director bobby?

మెగాస్టార్ చిరంజీవి కి ‘వాల్తేర్ వీరయ్య వంటి హిట్ సినిమాని ఇచ్చిన దర్శకుడు బాబి. ఇప్పుడు నట సింహం నందమూరి బాలకృష్ణ తో జతకట్టనున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని బాబి కథ సిద్ధం చేస్తున్నారట. చిరు తో సినిమా చేసేటప్పటి నుంచే బాలయ్య తోను సినిమా చేస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వచ్చే నెల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కి సంబంధించి క్లారిటీ ఇవ్వనున్నారు.

అదే రోజు టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారని సమాచారం..ప్రస్తుతం బాలకృష్ణ..అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘NBK 108’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన కాళీమాత భక్తుడిగా కనిపించనున్నట్లు సమాచారం. యువ హీరోయిన్ శ్రీ లీల కీలకపాత్ర పోషిస్తుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్. బాలయ్య ఇందులో శ్రీలీలకు బాబాయిగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ కూడా ‘బాబాయ్’ అనే పెట్టనున్నట్లు సమాచారం.!!

FIRST COMEDY HERO OF TOLLYWOOD!

anchor Anasuya to impress in bold character as Sumathi!