in

Mrunal thakur speaks on doing Sita Ramam 2!

సీతారామం..ఈ ఒక్క సినిమాతో పాపులరైంది మృణాల్ ఠాకూర్. హను రాఘవపూడి తీసిన ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇప్పుడీ మూవీపై మరోసారి ఆశలు పెట్టుకుంది మృణాల్. సీతారామం సినిమాకు సీక్వెల్ తీస్తే, తనకంటే సంతోషించే వ్యక్తి మరొకరు ఉండరని చెబుతోంది. “నా కెరీర్ లో ఇప్పటివరకు బెస్ట్ మూవీ సీతారామం. తెలుగులో మళ్లీ సీత లాంటి పాత్ర పోషించాలని ఉంది. బహుశా.. అలా జరగాలంటే సీతారామం-2 రావాలేమో. అదే కనుక జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు.” ఇలా సీతారామం-2పై స్పందించింది మృణాల్. నిజానికి ఆమె రియాక్షన్ బాగుంది కానీ, సీతారామం సినిమాకు సీక్వెల్ మాత్రం రాకపోవచ్చు. ఎందుకంటే, కథకు సరైన ముగింపు ఇచ్చారు. మరీ ముఖ్యంగా హీరో పాత్ర చనిపోతుంది. కాబట్టి పార్ట్-2 తీయాలంటే మరో హీరోను సీతకు పరిచయం చేయాలి లేదంటే, సీత పాత్ర చుట్టూ మరో కథ అల్లుకోవాలి..!!

SAD STORY OF A LUCKY VILLAIN!

Radhika Apte says she was told to get ‘better nose, bigger breasts’!