నటశేఖర్ కృష్ణ తీరని కోరిక, తాను అనుకున్నది ఏదైనా విమర్శలకు వెరవక, చేసి చూపించిన ఘనత కృష్ణ గారిది. అల్లూరి సీతారామ రాజు వంటి చారిత్రాత్మక చిత్రం, దేవదాసు వంటి విమర్శలకు గురి అయిన చిత్రాలు తీసి, కృష్ణ మొండి వాడు అని సినీ జనాలు అనుకుంటున్నా రోజుల్లో, 1977 లో “దాన వీర సూర కర్ణ”కు పోటీగా తాను నిర్మించిన కురుక్షేత్రం సినిమా నిర్మాణం తరువాత తన తదుపరి చిత్రం “ఛత్రపతి శివాజీ” చిత్రం అని అనౌన్స్ చేసారు కృష్ణ. ఆ తరువాత కృష్ణ గారు ఇతర చిత్రాలతో బిజీ అవటం తో చిత్రం కొంత ఆలస్యం అయింది. ఆ సమయం లోనే త్రిపురనేని మహారథి గారికి స్క్రిప్ట్ బాధ్యతలు అప్పగించారు. ఈ సినిమాను తమిళ్, తెలుగు భాషలలో నిర్మించ దలచి, తెలుగులో కృష్ణ గారు, తమిళ్ లో శివాజి గణేశన్ ను ఛత్రపతి శివాజీ రోల్ కి అనుకోని సన్నాహాలు ప్రారంభించారు. ఇంతలో దేవుడు చేసిన మనుషులు చిత్రం హిందీలో నిర్మాణం ప్రారంభించారు,ఆ తరువాత అల్లూరి సీతారామ రాజు చిత్రం సెకండ్ రిలీజ్ అయి, వంద రోజులు ఆడింది..
ఆ ఫంక్షన్ లో మళ్ళీ, ఛత్రపతి శివాజీ నిర్మాణం గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సమయం లోనే మహారథి, యెన్.టి.ఆర్ తో కలసి రాజకీయాలలో బిజీ గ ఉండటం తో మరి కొంత ఆలస్యం అయింది. తన 200 చిత్రం గ ఛత్రపతి శివాజీ సినిమా నిర్మాణం చేయాలనీ నిర్ణయించుకొని, దర్సకత్వ బాధ్యతలు విజయనిర్మల గారికి అప్పగించాలి అనుకున్నారు. ఆ కోణం లో ప్రయత్నాలు ప్రారంభించారు, మళ్ళీ కృష్ణ గారు బిజీ కావటం తో సినిమా వాయిదా పడింది.ఇలా రక, రకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన చిత్రం, కొంత మంది ఈ చిత్రంని నిర్మిస్తే మత ఘర్షణలు వచ్చే ప్రమాదం ఉందని కృష్ణ గారిని హెచ్చరించారు, తన చిత్రం వలన సమాజం లో అలజడి రావటం ఇష్టం లేని కృష్ణ గారు ఈ చిత్రాన్ని పూర్తిగా ప్రక్కన పెట్టేసారు. దీనికి బదులుగ “ఈనాడు” చిత్రాన్ని తన 200 వ చిత్రంగా నిర్మించారు. ఆలా అనొకొని కారణాలతో, ఎన్నో అవాంతరాలు ఎదురు కావటం తో కాంట్రవర్సీ కి కారణం కావటం ఇష్టం లేని కృష్ణ గారు ఒక మంచి రోల్ ను చేయలేకపోయారు, బాడ్ లక్ !!!