in

Kerala student misbehaves with Aparna Balamurali on stage!

మ అభిమాన తారలను చూసి ఆనందం పొందే వాళ్లు కొందరైతే, వారిని తాకాలని చూసేవారు ఇంకొందరు. రెండో రకం వాళ్లతో హీరోయిన్లు ఇబ్బందులు పడుతుంటారు. గతంలో ఎందరో హీరోయిన్లను పబ్లిక్ ప్లేస్‌లో అనుచిత ప్రవర్తనకు గురైనవారే. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు మలయాళ నటి, జాతీయ అవార్డ్ గ్రహీత అపర్ణా బాలమురళీ..అపర్ణ తాజా చిత్రం ‘తన్కమ్’. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ లాంచ్ చేసింది. దీనిలో భాగంగా తన కో స్టార్ వినీత్ శ్రీనివాసన్‌తో కలిసి ఆమె కేరళలోని ఓ లా కాలేజీ‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అపర్ణ వేదికపై కూర్చొని వుండగా.. ఓ విద్యార్ధి స్టేజ్‌పైకి చేరుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా ఆమెను బలవంతంగా నిల్చోబెట్టి.. భుజంపై చేయి వేయబోయాడు. ఊహించని ఈ సంఘటనతో షాక్‌కు గురైన అపర్ణ .. అతనికి దూరంగా జరగడంతో పాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాసేపటికీ సదరు విద్యార్ధి స్టేజ్ మీదకు వచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!!

Prabhas and Prasanth Neel’s next project titled Ravanam?

who is responsibility for our death? netizens question sreeleela!