in

i will not act with pawan kalyan, says Priyanka Jawalkar!

టాక్సీవాలా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. అనంతపురానికి చెందిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది..పవన్ కల్యాణ్ తో కలిసి నటించే అవకాశాం వస్తే? ఏం చేస్తారు? అనే ప్రశ్నకు ప్రియాంక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ అభిమానిగా ఆయన్ని ఇష్టపడుతాను తప్ప, ఆయనతో సినిమా చేయలేను అని చెప్పింది. “ఓ అభిమానిగా ఆయనను చూసి సంతోషపడతాను.

అంతకు మించి ఏమీ కోరుకోవడం లేదు. ఆయనతో కలిసి సినిమా చేయాలనే ఆలోచన నాకు లేదు. ఒకవేళ ఆయన సినిమాలో ఛాన్స్ వచ్చినా, చేయను” అని చెప్పింది. ఆమె ఆన్సర్ తో యాంకర్ తో పాటు సినీ లవర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. పవన్ కల్యాణ్ తో సినిమాలు చేసేందుకు ప్రతి హీరోయిన్ ఎదురు చూస్తుంటుంది. కానీ, ఈ అమ్మాయేంటి చేయనంటుంది? అని అనుకుంటున్నారు.

actress Amala Paul denied entry in Kerala Temple!

Eshanya Maheshwari Stills in red half saree!