స్నేహితుడి కోసం గంజాయి సప్లయర్ అవతారం ఎత్తిన రచయిత, కోన వెంకట్. కాలేజీ రోజుల్లో ఉండే స్నేహాలు, స్నేహం కోసం ఏమైనా చేసేయాలని టీనేజ్ ఆవేశాలు సహజం. మనం కూడా స్నేహితుల కోసం చేసిన కొన్ని పనులు తలచుకుంటే అవి చేసింది మనమేనా అనిపిస్తుంది ఇప్పుడు. కోన వెంకట్, మాజీ ముఖ్యమంత్రి, కోన ప్రభాకర్ రావు గారి మనవడు, అప్పట్లో ఆయన మహారాష్ట్ర గవర్నర్ గ పని చేస్తున్నారు, కోన వెంకట్ గారి తండ్రి పోలీస్ డిపార్మెంట్ లో డి.ఎస్.పి. గ పని చేస్తున్న రోజుల్లో అయన చేసిన సాహసం ఇది. కోన వెంకట్ స్నేహితుడు ఒకడు రక, రకాల వ్యాపారాలు చేసి నష్టాల పాలయ్యాడు, చివరకు భార్య కూడా అతని తో విసిగిపోయి కొడుకు తో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇతను చేసిన అప్పులకు షూరిటీ సంతకాలు చేసిన తండ్రి జైలు పాలయ్యాడు.
ఈ కష్టాల నుంచి బయట పడటానికి, చివరి ప్రయత్నం గ తనకు ఉన్న పొలం లో గంజాయి సాగు చేసాడట ఆ మహాను భావుడు. ఆ గంజాయిని గోవా కు తరలించే సమయంలో ఒక పోలీస్ అధికారికి దొరికి పోయాడు, ఆ అధికారి ఇతనిని వదలటానికి రెండు లక్షలు అడిగాడట, లేదంటే కేసు బుక్ చేసి లోపలేస్తానని బెదిరించేసరికి ఏమి చేయాలో పాలు పోనీ అతను ఆత్మ హత్య ప్రయత్నం చేసి, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నపుడు, విషయం తెలిసి, స్నేహితులతో కలసి వెంకట్ గారు అతనిని చూడటానికి వెళ్లారట, స్నేహితుడి సినిమా కష్టాలు విని చలించిపోయిన వెంకట్ గారు ఎలాగయినా అతనిని కష్టాల నుంచి బయట పడేయాలి అని నిర్ణయించుకొని, అక్కడడక్కడ డబ్బులు పోగేసి, ఆ గంజాయిని హ్యాండ్ ఓవర్ చేసుకొని , దానిని కారులో తీసుకొని, స్నేహితులతో కలసి గోవా కి బయలుదేరి వెళ్లారట.
ఆ సమయం లో కోన ప్రభాకర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్ గ పని చేస్తున్నారు, ఆయనే అప్పటి గోవా ఇన్ ఛార్జ్ గవర్నర్ కూడా, చూడండి, ఎంతటి ప్రమాదకరం అయిన పనిని నెత్తినేసుకున్నారో కోన వెంకట్ గారు. ఆ వయసు, ఆ ఉడుకు రక్తం అటువంటిది. గంజాయి తో పోలీస్ లకు దొరికితే ఇంకేమయిన ఉందా? ఫ్యూచర్ బ్లాంక్ కదా? అయిన అతనికి సహాయం చేయాలి అనే సంకల్పం తో ఆంధ్ర- కర్ణాటక బోర్డర్, కర్ణాటక- గోవా బోర్డర్ దాటి వెళ్లి కార్యం ముగుంచుకుని వచ్చారట. గోవా లో జరిగిన విషయాలు మాత్రం సస్పెన్స్ , ఎందుకంటె ప్రస్తుతం ఇదే సబ్జెక్టు తో సినిమా తీయటానికి పూనుకున్నారు కోన వెంకట్ గారు, హీరో ఎవరు అన్నది ఇంకా తెలియదు, ఇటువంటి సబ్జెక్టుకు హీరో, స్టోరీయే, కాబట్టి ఎవరయినా ఫరవాలేదు. కాకపోతే అప్పటి క్రిమినల్ మైండ్ ఇప్పుడు క్రియేటివ్ మైండ్ అయింది. హాట్స్ ఆఫ్!! టు హిస్ ఫ్రెండ్ షిప్, అండ్ గట్స్!!!