in

happening beauty Hikes Her Fee, Demands huge now!

ప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో షైన్ అవుతున్న యంగ్ హీరోయిన్స్ లో శ్రీ లీల కూడా ఒకరు. ఇప్పుడు ఈమె పేరు నెక్స్ట్ లెవెల్లో తెలుగు సినిమా వర్గాల్లో మంచి హాట్ టాపిక్ గా మారగా ఇప్పుడు ఈ హీరోయిన్ పై కొన్ని గాసిప్స్ మరింత స్థాయిలో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అయితే శ్రీ లీల చిన్న సినిమా తోనే స్టార్ట్ కాగా ధమాకా తో పెద్ద ఆఫర్ అందుకుంది. మరి ఈ రెండు సినిమాలకి కూడా ఈ యంగ్ బ్యూటీ తక్కువ రెమ్యునరేషన్ నే ఛార్జ్ చేసినా ఇప్పుడు మాత్రం ధమాకా సెన్సేషనల్ హిట్ తో ఈమె కూడా రెమ్యునరేషన్ భారీ గా పెంచినట్టుగా ఇప్పుడు ఇన్సైడ్ టాక్.

మరి గత సినిమాలకి 50 లక్షల లోపే ఈ యంగ్ హీరోయిన్ రెమ్యునరేషన్ గా ఛార్జ్ చేయగా ఇప్పుడు సగానికి పైగా పెంచేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ సినిమా తర్వాత నుంచి ఆమె ఓ సినిమా ఓకే చేస్తే మినిమమ్ 1 కోటి ఛార్జ్ చేయనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దీనితో ఈ టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో టాపిక్ గా మారింది. మరి దీనిలో ఎంతవరకు నిజమో లేదో అనేది చూడాలి. ఇక ఈ యంగ్ బ్యూటీ తెలుగు సహా కన్నడ లో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే తెలుగులో అయితే మరిన్ని చిత్రాలు ఈమె ఓకే చేస్తున్నట్టుగా భోగట్టా..!!

stunning kannada actress Ashika Ranganath makes tollywood debut!

BHANUMATI VS CHAKRAPANI!