రష్మిక మందన్న సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అయితే ఇటీవల రష్మికపై మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. కన్నడ పరిశ్రమ రష్మికను బ్యాన్ చేసిందని, కన్నడ సినిమాల గురించి రష్మిక చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వచ్చాయి. అయితే తాజాగా తనపై వస్తోన్న ప్రచారం పై రష్మిక స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనపై కన్నడ లో ఎలాంటి బ్యాన్ విధించలేదని చెప్పింది. నిజానికి ‘కాంతార’ సినిమా విషయంలో కొంతమంది అత్యుత్సాహం చూపించారని, ఆ సినిమా విడుదల అయిన వెంటనే తాను చూడలేకపోయానని చెప్పింది. అయితే తర్వాత చూసి తాను యూనిట్ కు మెసేజ్ పెట్టానని పేర్కొంది. కానీ ఇవన్నీ ప్రేక్షకులకు తెలియవని చెప్పింది. వృత్తిపరంగా ఏం ఉన్నా అవన్నీ ప్రేక్షకులకు చెప్తానని, అది తన బాధ్యత అని చెప్పింది. అయితే తమ వ్యక్తిగత విషయాలను కెమేరా ముందు ఎలా బయటపెడతామని, అంత అవసరం కూడా లేదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం రష్మిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!