in

Sizzling beauty Mehreen Pirzada’s needle therapy scares fans!

టాలీవుడ్‌లో ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఎఫ్2, ఎఫ్3 సినిమాల సక్సెస్‌తో అమ్మడికి క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలను చాలా నెమ్మదిగా చేస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా మెహ్రీన్ ఓ షాకింగ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు ఆమెకు ఏమైందా అని భయపడుతున్నారు. ముఖం నిండా సూదులు గుచ్చుకుని ఉన్న ఫోటోను మెహ్రీన్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

అయితే తాను ప్రస్తుతం ఆక్యుపంచర్ ట్రీట్మెంట్‌లో ఉన్నానని.. ఇందులో భాగంగా ఆక్యుస్కిన్‌లిఫ్ట్ అనే థెరఫీ చేయించుకుంటున్నట్లు మెహ్రీన్ తెలిపింది. ఈ ట్రీట్మెంట్ కారణంగా ముఖం మరింత కాంతివంతంగా అవుతుందని ఆమె పేర్కొంది. ఇలా తమ అభిమాన హీరోయిన్ ముఖం నిండా సూదులు గుచ్చి ఉండటం చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గరయ్యారు. అయితే వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఈ ట్రీట్మెంట్ తీసుకుంటుందని తెలుసుకుని అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మరి మెహ్రీన్‌ను ఇలా చూసి మీరు ఎలా ఫీలయ్యారో కామెంట్ చేయండి..!!

Poonam Kaur Diagnosed with a rare disease!

HIT: The Second Case