రొమాంటిక్ యూత్ సినిమాగా ప్రేక్షకుల ముందు రాబోతున్న అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యూయేల్ సినిమా ఊర్వశివో రాక్షసివో. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ అన్నీ ఒక రేంజ్ లో సాగి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా పై అల్లు శిరీష్ తో పాటు అను ఇమ్మాన్యూయేల్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది..గతంలో అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ రాగానే ఆమె చాలా సంతోష పడింది. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన సినిమా కావడంతో తన కెరియర్ కు బూస్ట్ అవుతుంది అని చాలా ఊహించుకుంటూ కాలం గడిపింది. తీరా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.
తీరా అల్లు అర్జున్ అన్నా హిట్ ఇస్తాడు అనుకుంటే అదికూడా ప్లాప్ అయ్యింది. ఇక తర్వాత వచ్చిన సినిమాలు ఏవి అమ్మడిని పైకి తీసుకొని రాలేదు..ఇప్పుడు అను ఇమ్మాన్యూయేల్ ఆశలన్నీ కూడా ఊర్వశివో రాక్షసివో అనే సినిమా పైనే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం అల్లు శిరీష్ ఘాడమైన ముద్దు సన్నివేశాలు, హాట్ సన్నివేశాలు తో హడావుడి చేసింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు యూత్ ను విపరీతంగా అలరించాయి. ఇక ఈ సినిమా అయినా తనది ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ అని మారుస్తుందో లేదొ వేచి చూడాలి..!!