ఆర్.ఆర్.ఆర్ తరవాత ఎన్టీఆర్ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. కొరటాల శివతో సినిమా ప్రకటించినా – దానికి సంబంధించిన అప్ డేట్ ఇప్పటి వరకూ లేదు. పైగా ఈ సినిమాపై ఎన్ని రూమర్లో. కొరటాల చెప్పిన కథ ఎన్టీఆర్‌కి నచ్చలేదని, దాంతో ఎన్టీఆర్ ఈ సినిమాని పక్కన పెట్టాడని వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ గాసిప్పులే అని తేలిపోయింది. ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి సమాయాత్తం అవుతోంది..ఈలోగా ఈ సినిమాపై మరో రూమర్ బయటకు వచ్చింది.
ఈ సినిమాకి ఆర్థిక సమస్యలున్నాయని, ఫైనాన్షియర్లు కావాలని మరో వార్త షికారు చేస్తోంది. ఈ సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోయిందని, ఇప్పుడు కొరటాల ఫండింగ్ కోసం చూస్తున్నాడన్నది వార్తల సారంశం. అయితే ఇది కూడా గాసిప్పే అని తేలిపోయింది. ఈ సినిమాకి బడ్జెట్ సమస్యలేం లేవని, భారీ హంగులతో, టాప్ టెక్నీషియన్లతో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమని చిత్రబృందం స్పష్టం చేసింది. కొరటాల శివ ఈ సినిమాకి క్లాప్ కొట్టేంత వరకూ ఏదో ఓ వార్త బయటకు వస్తూనే ఉంటుంది. దాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో..?