మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 1999 లో స్వయంవరం చిత్రం ద్వారా మాటల రచయిత గ సినీ రంగ ప్రవేశం చేసారు.రచయితగా ప్రవేశించి సినీ రంగంలోని పోటీకి తట్టుకొని డైరెక్టర్ ఎదగటమే కాదు, స్టార్ డైరెక్టర్ గ వెలుగొందుతున్నారు . విపరీతమయిన పోటీ ఉండే సినీ,క్రీడా,రాజకీయ, వ్యాపార రంగాలలోని వారికీ సెంటిమెంట్లు కూడా మెండుగానే ఉంటాయి. మన మాటల మాంత్రికుడికి కూడా ఒక సెంటిమెంట్ ఉంది, అదేమిటంటే, అయన సినీ రంగ ప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తున్నపుడు నటుడు సునీల్, దర్శకుడు దశరధ్ తో కలసి పంజాగుట్టలోని సాయిబాబా గుడికి దగ్గరలో ఒక చిన్న రూమ్ లో అద్దెకు ఉండేవారు. ఆ గది నుంచే ఆయన ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలకు మాటలు అందించారు. స్వయంవరం, సముద్రం, నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి వంటి సినిమాలకు మాటలు వ్రాసారు.
ఆ తరువాతి క్రమం లో ఆయన డైరెక్టర్ గ ఎదిగి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు, తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు. పెద్ద ఇల్లు, కార్లు ఏర్పాటు చేసుకున్నారు అయినా, ఆయన తాను మొదట్లో నివసించిన పంజాగుట్ట రూమ్ ని వదిలిపెట్టలేదు. ఇప్పటికి ఆ రూమ్ కి 5000 రెంట్ కడుతూ ఆ రూమ్ ని అలాగే మైంటైన్ చేస్తున్నారు.త్రివిక్రమ్ కి ఆ రూమ్ అంటే వల్లమాలిన మమకారం, తనకు మొదట ఆశ్రయం ఇచ్చిన ఇంటి మీద ఉన్న ప్రేమతో ఇప్పటికి ఆ రూమ్ ని వదిలిపెట్టలేదు. ఇప్పటికి కొన్ని సినిమాలకు మాటలు వ్రాయటానికి ఆ రూమ్ కె వెళ్లి, అక్కడ నుంచే వ్రాస్తుంటారట. రియల్లీ ఇట్ ఈజ్ ఆ స్వీట్ సెంటిమెంట్, హవింగ్ స్వీట్ సెంటిమెంట్ ఈజ్ బెటర్ ధ్యాన్ ఏ బ్లైండ్ సెంటిమెంట్. కొన్ని మధురమయిన నమ్మకాలూ మన ఎదుగుదలకు తోడ్పడతాయి, గుడ్డి నమ్మకాలూ ప్రతిబంధకాలు గ మారతాయి..!!