మహానటి సావిత్రి, యెన్.టి.ఆర్ కాంబినేషన్ అంటే అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టేవారు. కానీ ఒకానొక సందర్భం లో సావిత్రి ఆ పాత్రకు వద్దు అని కృష్ణ కుమారిని ఆమెకు బదులుగా తీసుకున్నారట అన్నగారి సలహా ప్రకారం. క్రమశిక్షణకు మారు పెరయిన యెన్.టి.ఆర్., వృత్తిని దైవంగా భావించేవారు.పౌరాణిక పాత్రలు ధరించినప్పుడు ఎంతో నియమ, నిష్టలతో ఉండేవారు. కృష్ణ జిల్లాకు చెందిన తిరుపతమ్మ దేవాలయం అంటే యెన్.టి.ఆర్. కి ఎంతో భక్తి, యెన్.టి.ఆర్ సి.ఏం.అయిన తరువాత తిరుమల, ఆ తరువాత తిరుపతమ్మ దేవాలయం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. అటువంటి తిరుపతమ్మ కథను సినిమాగా తీయాలి అనుకున్న యెన్.టి.ఆర్ తన సొంత బ్యానర్ లో ప్రయత్నాలు ప్రారంభించారు, ఇంతలో మరో నిర్మాత తానూ ఆ సినిమాను నిర్మిస్తాను అని ముందుకు వచ్చి తిరుపతమ్మ క్యారెక్టర్ కి సావిత్రి గారిని తీసుకుందామని చెప్పటం జరిగిందట.
నిర్మాతగా అతనిని అంగీకరించిన యెన్.టి.ఆర్. తిరుపతమ్మ పాత్రకు సావిత్రమ్మ వద్దులే అని చెప్పి కృష్ణ కుమారిని తీసుకోమని చెప్పారట. యెన్.టి.ఆర్. సావిత్రి గారిని సావిత్రమ్మ, లేకుంటే పెద్దమ్మాయి అని పిలిచే వారట. ఒకింత ఆశ్ఛర్యానికి లోనయిన నిర్మాత కృష్ణ కుమారిని తిరుపతమ్మ పాత్రకు తీసుకొని సినిమా నిర్మించటం జరిగింది. అయితే సావిత్రమ్మను ఎందుకు వద్దన్నారన్నది ఇప్పటికే మిస్టరీ! కొంత మంది సినీ పండితుల ఊహ ఏమిటంటే అప్పటికే మద్యానికి అలవాటుపడిన సావిత్రి గారి చేత తిరుపతమ్మ పాత్ర చేయించటం ఇష్టం లేక యెన్.టి.ఆర్ ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు అనుకుంటారు, ఇప్పటికి ఎవరికి తెలియదు నిజమేమిటో. నిజమే అయి ఉండవచ్చు అనుకున్నారు యెన్.టి.ఆర్ నిబద్ధత తెలిసిన వారు, ఆయన సాంప్రదాయాలకు కట్టుబాట్లకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో తెలిసిన వారు..