1960 – 1970 దశకాలలో నందమూరి తారక రామ రావు మొదటి భార్య గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో చాల చర్చ జరిగేది. ఇది వాస్తవానికి ఆయనను ఆట పట్టించేందుకు సీనియర్ దర్శక నిర్మాతలు చేసిన పని. యెన్.టి.ఆ.ర్ సహా నటులు అయినటువంటి ఎస్.వి.ఆర్, రాజనాల, రమణ రెడ్డి వంటి వారి సహవాసం లో యెన్.టి.ఆర్. కి సిగరెట్ తాగే అలవాటు తగులుకుంది. సినిమాలలో యెన్.టి.ఆర్. సిగరెట్ తాగే స్టైల్ అప్పటి యువతను బాగా ఆకర్షించింది. సరదాగా చేసుకున్న అలవాటు వ్యసనంగా మారి పోయింది, దీనితో అన్న గారు సినిమా షూటింగ్ సమయం లో కూడా సిగరెట్ లేకుండా ఉండే వారు కాదు. కాలక్రమంలో రమణ రెడ్డి సిగరెట్ మానేశారు, రాజనాల సిగెరెట్ కు బదులు పైపు కాల్చటం ప్రారంభించారు.
యెన్.టి.ఆర్. మాత్రం సిగరెట్ లు మానక పొగ… మోతాదు పెంచారు, ఎవరయినా మానేయమని చెప్పిన పెద్దగా పట్టించుకొనే వారు కాదు. ఇదే విషయం మీద సినీ దర్శకులు , నిర్మాతల మధ్య ఆసక్తికరమయిన చర్చ సాగుతుండేదట, “సిగెరెట్ అంటే ఏమనుకుంటున్నావు రామ రావు ఫస్ట్ వైఫ్ దానిని ఆయన వదిలి పెట్టారు, మీరు లేని పోనీ సలహాలు ఇవ్వకండి” అంటూ సరదాగా ఆట పట్టిస్తూ మాట్లాడే వారట, ఎందుకంటె యెన్.టి.ఆర్. గారి సిగరెట్ ఖర్చులు నిర్మాతలే భరించవలసి వచ్చేది, దీని కారణం గ వారే యెన్.టి.ఆర్. మొదటి పెళ్ళాం అంటూ కామెంట్ చేయటం వలన, ఆ మాట చాల కాలం సినీ పరిశ్రమలో ప్రచారం లో ఉన్నది..