in

Nani Gives New Definition To Pan-India Films!

టాప్ స్టార్లు అయ్యుండి కొంతమంది కొన్ని అంశాలపై మాట్లాడాల్సిన సమయంలోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరల సమస్య మీద ఓపెన్‌గా తన అభిప్రాయం చెప్పడం ద్వారా హీరో అయ్యాడు నాని. ఈ విషయాన్ని కావాలని వివాదాస్పదంగా మార్చిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ నాని సరిగ్గానే మాట్లాడాడన్నది మెజారిటీ అభిప్రాయం. ఇప్పుడు ఈ విషయంపై నాని క్లారిటీ ఇచ్చాడు. దీంతో పాటుగా నాని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ మధ్య అందరూ పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ తమ సినిమాల గురించి ఊదరగొట్టేస్తుండటం గురించి నాని తనదైన శైలిలో పంచ్ వేశాడు.

ఊరికే పోస్టర్ల మీద పాన్ ఇండియా ఫిలిం అని వేసుకుంటే.. బయట ప్రచారం చేసుకుంటే.. అవి పాన్ ఇండియా సినిమాలు అయిపోవని నాని అన్నాడు. ‘పుష్ప’ సినిమా కథ చిత్తూరు ప్రాంతంలో ఉండే శేషాచలం అడవుల చుట్టూ, ఇక్కడి మనుషుల చుట్టూ తిరుగుతుందని.. కానీ ఆ సినిమాను దేశమంతా ఆదరించిందని.. దీన్ని బట్టి ఏ ప్రేక్షకులకైనా కనెక్ట్ అయ్యే ఎమోషన్ సినిమాలో ఉండడం కీలకమని.. అప్పుడు భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని.. అంతే తప్ప ఎవరికి వాళ్లు తమది పాన్ ఇండియా సినిమా అనేస్తే.. పోస్టర్ల మీద వేసేస్తే లాభం లేదని నాని స్పష్టం చేశాడు. కాబట్టి అందరూ కంటెంట్ మీద దృష్టిపెట్టాలని.. అప్పుడు ఆటోమేటిగ్గా సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఆడుతాయని నాని అన్నాడు.

producer MS Raju reveals bhumika chawla’s odd behavior!

Niir Arora Photos at Haveli Coffee Shop Opening!