in

jathi ratnam beauty faria to play ravi teja’s sister?

వరస డిజాస్టర్ లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే “క్రాక్” సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అయితే ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన “ఖిలాడి” సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా రవితేజ త్వరలోనే త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో “ధమాకా” అనే సినిమాలో నటిస్తున్నారు. “జాతి రత్నాలు” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో ఆమె రవితేజ చెల్లెలి పాత్రలో కనిపించనున్నారు అని సమాచారం. “జాతి రత్నాలు” సినిమా హీరోయిన్ గా పరిచయమైన ఫరియా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఆ తరువాత బంగార్రాజు వంటి కొన్ని సినిమాల్లో నటించింది కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయాయి. ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫరియా ఈ సినిమాకు పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. మరి ఈ సినిమాతో ఆమె ఎంత వరకు హిట్ అందుకుంటుందో చూడాలి. మరో వైపు రవితేజ హీరోగా “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

bangaram actress Meera Chopra Hot Cleavage Show Stills!

heroines always prefer surgeries to faces and bodies: Radhika Apte