in

pooja hegde gives green signal for another special song?

కప్పుడు మాస్ యాక్షన్ సినిమాలలోనే అలరించే ఐటెం సాంగులు ఇటీవల ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ అండ్ కామెడీ, థ్రిల్లర్, హర్రర్ సినిమాలనే తేడా లేకుండా వాటిల్లో కూడా కనిపించి కనువిందు చేస్తున్నాయి. ఒకప్పుడు ఐటెం పాటలను చేసే డాన్సర్లు వేరేగా ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో హీరోయిన్లతోనే స్పెషల్ సాంగ్స్, సీజ్లింగ్ సాంగ్స్ అని పేరు మార్చి ఐటెం సాంగులనే చేస్తున్నారు. నేటి కాలంలో మిల్కీ బ్యూటీ తమన్నా తో స్టార్ట్ చేస్తే, కాజల్, పూజాహెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు ఐటెం భామలకు ధీటుగా గ్లామర్ తో పటు డాన్స్ మూవ్మెంట్స్ ను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. నిజానికి ఈ ట్రెండ్ లో హీరోయిన్ పూజాహెగ్డే లక్కీ చార్మ్ అనే చెప్పాలి. ఆమె ఐటెం సాంగ్ చేసిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లవుతున్నాయి. రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలంలో జిగేలురాణిగా జిల్ జిల్ జిగేలుమనిపించిన పూజా ఆపై ఎఫ్ 3 లో వెంకటేష్, వరుణ్లతో కలిసి స్టేజి అదిరిపోయే పార్టీ సాంగ్ ను చేసింది.

ఈ రెండు పాటలకు ప్రేక్షకాభిమానుల నుండి విశేష స్పందన రావడం విశేషం. దీంతో పూజా ఐటెం సాంగ్ ఉంటే ఆ సినిమా హిట్టే అన్న సెంటిమెంటు చిత్రసీమలో విస్తృతంగా ప్రచారమవుతుంది. ఈ సెంటిమెంటుతో ఫ్యూచర్ లో పూజా హెగ్డే ఐటెం సాంగులకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. తాజాగా పూజాహెగ్డే మరొక సినిమాలో ఐటెం పాట చేయబోతోందని ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ సారి టాలీవుడ్లో కాదు బాలీవుడ్లో. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న యానిమల్ సినిమా లో పూజా ఐటెం పాట ఉండబోతుందని బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. టాలీవుడ్లో పూజా కు బాగా అచ్చొచ్చిన ఐటెం పాటల ట్రెండ్ కు బాలీవుడ్లో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి…

telugu tv actress maithili attempts suicide in Hyderabad!

telugu girl Ritu Varma Latest Photoshoot stills!