in

bubbly beauty Raashii Khanna fulfils mom’s wish!

టువంటి క‌ల్మ‌షం లేని అమ్మ ప్రేమను మాట‌ల్లో వ‌ర్ణించ‌డం అసాధ్యం. అందుకే అమ్మను ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని అంతర్జాతీయ మాతృదినోత్సవంగా జ‌రుపుకుంటారు. ఈ నేప‌థ్యంలోనే నేడు రెండో ఆదివారం కావ‌డంతో అంద‌రూ త‌మ త‌ల్లితో మ‌ద‌ర్స్ డేను జ‌రుపుకుంటున్నారు. అయితే మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్ర‌ముఖ హీరోయిన్‌ రాశీ ఖన్నా తన తల్లికి లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. బిజీ షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికీ.. ఈ స్పెష‌ల్ డే నాడు అమ్మ‌తోనే గ‌డ‌పాల‌నే ఉద్ధేశంతో షూటింగ్స్‌ను బ్రేక్ తీసుకుంది.

కోరుకున్న‌ట్లే అమ్మ‌తో టైమ్ స్పెండ్ చేసింది. అలాగే బీఎమ్‌డబ్ల్యూ కారును అమ్మ‌కు బహుమతిగా ఇచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌గా మారాయి. ఈ నేప‌థ్యంలోనే రాశీ త‌న త‌ల్లి ప్ర‌జెంట్ చేసి కారు ధ‌ర‌ను తెలుసుకుని నెటిజ‌న్లు షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే, ఆ విలాస‌వంత‌మైన కారు ధ‌ర అక్ష‌రాల రూ.1.40 కోట్లు. మొత్తానికి మ‌ద‌ర్స్ డే ఖ‌రీదైన గిఫ్ట్‌తోనే త‌ల్లిని స‌ర్‌ప్రైజ్ చేసిందీ బ్యూటీ. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈమె తెలుగుతో నాగ‌చైత‌న్యుకు జోడీగా `థ్యాంక్యూ` చిత్రంలో న‌టించింది. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

F3 Trailer, Venkatesh, Varun Tej, Anil Ravipudi!

can mahesh babu change keerthy suresh’s fate?