in

Alia Bhatt To Pair Opposite Mahesh Babu In SS Rajamouli’s Film?

ప్రస్తుతం టాలీవుడ్ అంతా బాలీవుడ్ భామలపై పడింది. స్టార్ హీరోల సినిమాలన్ని పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా.. హీరోయిన్ ని కూడా అదే రేంజ్ లో ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్ కలవరిస్తున్న పేరు అలియా భట్.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెల్సిందే. అమ్మడి రేంజ్ కూడా అక్కడ మాములుగా లేదు. ఇక ఇదే బజ్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన అలియా భట్ ఛాన్స్ అందుకుంది.

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో అలియా హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యిందన్న సంగతి తెలిసిందే..ఇక తాజగా మరో బిగ్గెస్ట్ ఆఫర్ ని అమ్మడు పట్టేసిందంట. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాజమౌళి.. తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెల్సిందే. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాత దుర్గారావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన అలియాను సెట్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కించడానికి జక్కన్న ప్లాన్ చేసినట్లు సమాచారం. అందుకే అలియా అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఒక్క అలియానే కాకుండా పాన్ ఇండియా నటుల్ని సినిమాలో భాగం చేయాలని టీమ్ భావిస్తోందిట.మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే జక్కన్న నోరు విప్పాల్సిందే.

Urvashi Rautela to do Item Song in Nithiin’s next!

Telugu Actress Sakshi Chaudhary Latest stills!