టాలీవుడ్ ప్రేక్షకులకు సుప్రీత అంత పరిచయం అయినప్పటికీ యాక్టర్ సురేఖ వాణి కూతురు అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పడతారు. ఈ తల్లీకూతుళ్లు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో వేరే స్థాయిలో హడావిడి చేస్తూ ఉంటారు. చాలా మంది నటిజన్లు వీరిద్దరూ అక్కా చెల్లెలు అనే వాపోతారు..ఇక ఎప్పటికప్పుడు వీరిద్దరి హాట్ పోస్టులను సోషల్ మీడియాలో పంచుకొని నెటిజన్లను ఆకట్టుకుంటారు. మొత్తానికి తల్లీకూతుళ్లు సోషల్ మీడియా ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకొని వేరే స్థాయిలో వెళుతున్నారని చెప్పవచ్చు. ఇక ఇదే కార్యక్రమంలో సురేఖ వాణి కూతురు సుప్రీత ఇటీవల ఒక మ్యూజిక్ ఆల్బమ్ కు శ్రీకారం చుట్టింది.
లవర్స్ మధ్య ఎమోషనల్ తెలియజేసేలా ‘వెళ్ళిపో’ అనే మ్యూజిక్ ఆల్బం లో నటించింది. ఈ వీడియో సాంగ్ ని వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. కాగా సుప్రీత తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఆ సాంగ్ షూటింగ్ లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది..ఈ సాంగ్ లో ముద్దు సీన్ ఆమెకు చాలా కష్టం అనిపించిందట. సాంగ్ లో ముద్దు సీన్ మళ్లీమళ్లీ చేయించారని అంతేకాకుండా రెండు రోజులు ఈ సీన్ షూట్ చేశారని తెలిపింది. లైఫ్ లో ఈ కిస్సులు హగ్గులు ఎప్పుడూ కాలేదు కదా అందుకే నాకు ఇబ్బందిగా అనిపించింది అంటూ వాపోయింది సుప్రీత. ఇక ఇంటర్వ్యూలో తెలియజేసిన ఈ ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..