in

young hero Sundeep Kishan Found His Love?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ బాలీవుడ్ బ్యూటీని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. మన హీరో ఒక అమెరికా అమ్మాయితో సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నాడట. ఈ టాలీవుడ్ హీరో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల ఈ హీరో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త వెనుకబడిపోయాడనే చెప్పొచ్చు. కానీ తాజాగా మాత్రం బీటౌన్ బ్యూటీతో డేటింగ్ కారణంగా వార్తల్లో నిలిచాడు. సాధారణ స్నేహితుల ద్వారా కలుసుకున్న ఈ జంట సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి ఇద్దరూ కలిసి కొన్ని పబ్లిక్ ఈవెంట్‌లలో కూడా కనిపించారు. ఆ అమ్మాయి మరెవరో కాదు బాలీవుడ్ నటి సోనియా రాథీ..హర్యానాకు చెందిన సోనియా రాథీ అమెరికా పౌరురాలు. ఆమె “బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3″లో నటించింది. ఆమె తదుపరి హిందీ చిత్రం ‘తారా vs బిలాల్‌’లో కనిపించనుంది. మంచి డ్యాన్సర్ అయిన సోనియా ఇంతకు ముందు ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేసింది. ఇన్‌స్టాలో సోనియా ఇటీవలి చిత్రాలు, రీల్స్ వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే పుకార్లకు మరింత ఆజ్యం పోశాయి.

ఇక సందీప్ తరచుగా ముంబైలో కన్పిస్తూ ఉండడం తెలిసిందే. ఇవన్నీ సందీప్‌, సోనియా డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లకు ఊతమిస్తున్నాయి. అయితే వారిద్దరూ ఈ రూమర్స్ పై స్పందించలేదు. కానీ చాలాకాలం ఒంటరిగా ఉన్న సందీప్ ఎట్టకేలకు తన సోల్ మేట్ ను కలుసుకున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సందీప్ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘మైఖేల్‌’తో సహా మంచి చిత్రాలను కలిగి ఉన్నాడు.

surekha vani daughter supritha shocking comments on kissing scenes!

‘Hora Hori’ movie fame Aswini sizzling stills!