పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్ల సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. విదేశాల్లోనూ భీమ్లా నాయక్ మంచి వసూళ్లను రాబడుతోంది. భీమ్లా నాయక్ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలోకి రాజకీయ నాయకులు కూడా వచ్చి చేశారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ భీమ్లా నాయక్ చిత్రంపై స్పందించారు.
వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ పలు రకాల నిబంధనలు విధించిందంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు, లోకేష్.. భీమ్లా నాయక్ చిత్రంపై ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ వీరు ఏమన్నరాంటే..భీమ్లా నాయక్ చిత్రంపై వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ‘ జగన్ చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది.
తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది…నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ చంద్ర బాబు ట్వీట్ చేశారు..ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్‌ను, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పోస్టులు చేసే వర్మ.. భీమ్లా నాయక్ విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించినట్లు కనిపిస్తోంది. ట్విట్టర్ వేదికగా భీమ్లా నాయక్‌పై ప్రశంసలు కురిపించారు..ట్వీట్లో.. ‘భీమ్లా నాయక్ ఒక మెరుపు, పవన్ కళ్యాణ్ సునామి. రానా కూడా పవన్‌తో పాటీ పడీ నటించారు. మొత్తం మీదం భీమ్లానాయక్ భూకంపాన్ని సృష్టించింది’ అంటూ తనదైన శైలిలో రాసుకొచ్చారు వర్మ..