in

amani reveals her last wish as an actress!

టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన కథానాయికగా ఆమని కనిపిస్తారు. తెలుగులో ‘శుభలగ్నం’ .. ‘శుభ సంకల్పం’ .. ‘మిస్టర్ పెళ్లాం’ వంటి సినిమాలు ఆమె నటనకు కొలమానంగా నిలుస్తాయి. తెలుగులో బాపు .. కె విశ్వనాథ్ వంటి దర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం. వివాహమైన తరువాత కొంతకాలం పాటు సినిమాలకి దూరంగా ఉన్న ఆమని, ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా ఆయా సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతున్నారు.

తన మేనకోడలు హ్రితిక నటించిన ‘అల్లంత దూరాన’ సినిమా ప్రమోషన్స్ లో ఆమె కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ..”ఇంతవరకూ ఎన్నో విభిన్నమైన పాత్రలను చేస్తూ వచ్చాను. అయినా నేను ఇంకా ఒక నటిగా సంతృప్తి చెందలేదు. అలాంటి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాను. నా చివరి కోరిక ఏదైనా ఉందంటే, అది రాజమౌళి సినిమాలో చేయాలనేదే. ఆయన సినిమాలో చిన్న వేషమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పుకొచ్చారు.

khiladi effect, producer keeps 100 cr project on hold?

WHO IS BEHIND SHANKARA SHASTRY ?