in

star heroine Priyamani showers praises on Samantha and Nayanthara!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పై షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రియమణి. ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట్లో హాట్ టాపిక్‏గా మారాయి. ప్రియమణి మాట్లాడుతూ.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. హీరోయిన్ అంటే గ్లామర్‏గా.. పొట్టి దుస్తులు ధరించే రోజులు. పెద్ద హీరో సరసన రొమాంటిక్ లీడ్ రోల్స్ చేసే రోజులు పోయాయి. ఇప్పుడు హీరోయిన్‏కు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది నటీమణులు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఉదాహరణకు సమంత ఓ బేబి సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది. అలాగే నయనతార కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో రాణిస్తుంది. ఆమె రజనీకాంత్, విజయ్ సరసన నటించి ఇప్పుడు నేత్రికన్, మాయ వంటి అద్భుతమైన సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించింది అని పేర్కొన్నారు ప్రియమణి.

ప్రస్తుతం కాలం పూర్తిగా మారింది.. హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదని ప్రజలు అంగీకరిస్తున్నారు. నటనకు.. కంటెంట్ ప్రాధాన్యతనిస్తూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారని తెలిపింది. ఇక ఇటీవల సమంత నటించిన ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాట యూట్యూబ్‏లో మారుమోగిపోతుందని తెలిపింది. ఈ పాటతో సమంత అందరి మనసులు దొచేసిందని.. మొదటి సారి సమంత ఇలాంటి పాటలో నటించిందని….ఈ పాటలో సమంత చాలా హాట్‏గా కనిపించిందని.. తన భర్త కూడా ఇదే మాట చెప్పాడని తెలిపింది. సమంత ఈ పాటను ఎంచుకున్నందుకు అభినందనలు తెలిపింది. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో సమంత చేసిన పాట ట్రెండ్ అవుతుందని.. ఎంతోమంది సమంత చేసిన స్టెప్పులను ట్రై చేస్తున్నారని చెప్పుకొచ్చింది.

heroine heera career spoil avvadaniki karanamaina aa hero yevaru ?

Prabhas-starrer ‘Salaar’ to release in two parts?