in

kajal agarwal happy with balancing personal and professional life!

స్టార్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌గా కొనసాగుతూనే ఫ్యామిలీ లైఫ్‌‌‌‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఒకింత కష్టమే, కానీ రెండింటినీ సరిగ్గా  బ్యాలెన్స్ చేస్తే అదేమంత కష్టం కాదంటోంది కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాల్లో నటించిన కాజల్‌‌‌‌ అగర్వాల్, ప్రెగ్నెన్సీ కారణంగా ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంది. అయినా పెళ్లి తర్వాత తన కెరీర్‌‌‌‌‌‌‌‌ విషయంలో ఎలాంటి చేంజెస్‌‌‌‌ రాలేదని చెబుతోంది కాజల్. ‘బాలీవుడ్‌‌‌‌తో పాటు అన్ని సినిమా ఇండస్ట్రీస్‌‌‌‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోయిన్స్‌‌‌‌కంటూ ఓ పర్సనల్‌‌‌‌ లైఫ్‌‌‌‌ ఉంటుంది.  ప్రొఫెషనల్‌‌‌‌ లైఫ్‌‌‌‌తో దానికి సంబంధం లేదని అందరూ చాలా మెచ్యూర్డ్‌‌‌‌గా ఆలోచిస్తున్నారు.

అందుకే ఫ్యామిలీ లైఫ్‌‌‌‌లో ఎలాంటి మార్పులు వచ్చినా కెరీర్‌‌‌‌‌‌‌‌లోనూ హ్యాపీగా ముందుకెళ్తున్నాం’ అంది. ఇక పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్స్‌‌‌‌ సినిమాల ఎంపిక పద్ధతి మారుతుంటుంది. కానీ పెళ్లికి ముందు కూడా తాను సెలెక్టివ్‌‌‌‌గానే సినిమాలు చేశానని, దానినే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నానని అంటోంది. బాలీవుడ్‌‌‌‌లో ఇలా చాలామంది హీరోయిన్స్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌, పర్సనల్‌‌‌‌ లైఫ్‌‌‌‌ను బ్యాలెన్స్‌‌‌‌ చేస్తున్నారు. కానీ వాళ్లెవరూ తనకు రోల్‌‌‌‌ మోడల్ కాదని, తన ఓన్ స్టైల్‌‌‌‌లోనే రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నానంటోంది. ఏదేమైనా  కాజల్‌‌‌‌ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి తిరిగి వరుస సినిమాలు చేసేలా కనిపిస్తోంది.

Release your film at Pan India level..RGV Interesting Comments on Bhimla Nayak!

goa beauty Ileana’s Item Song With Ramarao?