తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా అనసూయ లేచి నిలబడకుండా కుర్చీలో కూర్చొని జాతీయ గీతం పాడింది. మనం జాతీయ గీతం పాట సమయాల్లో మనం గౌరవంగా లేచి నిలబడతాం. అనసూయ అలా చేయకుండా కూర్చొని పాడడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అనసూయ వేసుకున్న టీ షర్ట్ పై గాంధీ బొమ్మ ఉండగా గాంధీ బొమ్మ ఎందుకు వేసుకున్నావ్.. ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగానికి గాంధీకి సంబంధం ఏంటని కామెంట్ పెట్టారు. దీనిపై అనసూయ స్పందించింది..
నేనే సారీ చెబుతున్న.. ‘అరే ఏందిరా బై మీ లొల్లి.. నేషనల్ ఆంథమ్ అంటారు. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటి అని అంటారు. మరి జనగణమణ ఏంటి .. ఆగస్ట్ 15, 1947 తర్వాతే జనవరి 26, 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకుని మాట్లాడండి అని అనసూయ రిప్లై ఇచ్చింది…అయినప్పటికీ ఆమెపై ట్రోలింగ్ ఆగడం లేదు. ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండే అనసూయకు ఇది తలనొప్పిగా మారింది. మరి ఈ విషయం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.