in

‘Shyam Singha Roy’ Makes A Historic Spot In Netflix Global viewership!

నేచురల్ స్టార్ నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” డిసెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది. జనవరి 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ అయిన ఈ చిత్రం ఓటిటిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ మూవీ ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. జనవరి 17 నుంచి 23 మధ్య ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి దిగ్గజ ఓటిటిలో 3,590,000 వ్యూ అవర్స్ రావడం విశేషం. ఇక ట్రెండింగ్ విషయానికొస్తే నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ మూవీ మూడవ స్థానంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన మూడవ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఆ వారం టాప్-10లో మరే ఇతర భారతీయ సినిమా కూడా లేదు. ఈ రికార్డు కారణంగా సోషల్ మీడియాలో మరోసారి సినిమా గురించి చర్చ నడుస్తోంది. అలాగే యువ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ విజన్, ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన నాని, సాయి పల్లవిల నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. అటు థియేటర్ లోనూ, ఇటు ఓటిటిలోనూ ‘శ్యామ్ సింగ రాయ్’ నిజమైన క్లాసిక్ బ్లాక్ బస్టర్ అందుకుంది.

anchor anasuya lands in republic day controversy!

WHERE IS “HAPPY DAYS APPU” ?