in

nidhi agarwal’s ismart plan to attract power star fans!

బాలీవుడ్ సినిమాతో హీరోయిన్‌గా మారిన నిధి అగర్వాల్..తెలుగులో అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. తన అందచందాలతో ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత చైతూ తమ్ముడు అక్కినేని అఖిల్ సరసన మిస్టర్ మజ్ఞు సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఈ రెండు నిధికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాతో నిధి మొదటి రెండు సినిమాలకు రాని పాపులారిటీ అండ్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో పూరి రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఒక హీరోయిన్‌గా నిధి నటించి ఇస్మార్ట్ బ్యూటీగా టాలీవుడ్ ప్రేక్షకులను, మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది. దీంతో తమిళ ఇండస్ట్రీ నుంచి అమ్మడికి వరుసగా రెండు సినిమాలలో నటించే అవకాశాలు దక్కించుకుంది. ఇదే క్రమంలో పవర్ స్టార్ పవన్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఇందులో నిధి పంచమి అనే నర్తకి పాత్రలో మెరవబోతుంది. కాగా, నిధి ఇటీవల ఓ చిట్ చాట్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెప్పింది.

అంతేకాదు ఇప్పుడు మీకు బాగా ఫేవరేట్ సాంగ్ ఏది అని అడిగిన ప్రశ్నకు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్  రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలోని లా లా భీమ్లా సాంగ్ అని చెప్పి ఆశ్చర్యపరచింది. ఇప్పుడు ఈ సాంగ్ నిధి ఫేవరేట్ సాంగ్ అని..రిపీటెడ్‌గా వింటున్నానని చెప్పుకొచ్చింది. మొత్తానికి మెల్లగా పవన్ అభిమానులను ఆకట్టుకునే పనిలో ఉన్న నిధి వీరమల్లు సినిమాతో మంచి హిట్ అందుకుంటే ఖచ్చితంగా మెగా హీరోయిన్ అవుతుందనడంలో సందేహం లేదు.

nagarjuna very happy to see amala back on screen!

actress adah sharma in trendy blue frock!