in

nagarjuna very happy to see amala back on screen!

1993లో విడుదలైన రాజశేఖర్‌ ‘ఆగ్రహం’ చిత్రంలో ఆమె చివరిసారిగా పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటించింది. కాగా 2012లో మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అమల.. శేఖర్‌ కమ్ముల ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంలో మళ్లీ తెరపై కనిపించారు. ఆతర్వాత మలయాళంలో ‘కేరాఫ్ సైరాభాను’, ‘మనం’ చిత్రంలో డ్యాన్స్ టీచర్ కొద్ది సేపు కనిపించారు. అయితే పూర్తిస్థాయిలో మాత్రం తెరపై కనిపించలేదు. ఇప్పుడు ఆ లోటును పూడుస్తూ మరోసారి పూర్తిస్థాయిలో తెరపై కనిపించేందుకు రెడీ అవుతున్నారు. ఆ సినిమా పేరే ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమల కీలక పాత్రలో నటించింది.

నిన్ననే (బుధవారం) ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. దీనిని చూస్తుంటే తల్లీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత అమల తెరపై కనించడంపై నాగార్జున స్పందించారు. టీజర్‌ను ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. అదేవిధంగా సతీమణి అమలను ఉద్దేశిస్తూ ‘ ‘నిన్ను మళ్లీ తెరపై చూడడం సంతోషంగా ఉంది అమల. ‘ఒకే ఒక జీవితం సినిమా టీమ్‌ కు ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్‌ చేశారు నాగ్‌. కాగా ఈ సినిమాలో శర్వా పక్కన రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. నాజర్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు.

N.T.R KI HAND ICHINA KATTHI VEERUDU, KSHAMINCHINA N.T.R!

nidhi agarwal’s ismart plan to attract power star fans!