మొన్నటి వరకు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా మారారు. పుష్ప సినిమా నుండి అందరు ఐకాన్ స్టార్ అని పిలవడం మొదలు పెట్టారు. తనను సుకుమార్ ఐకాన్ స్టార్ అని అన్నాడంటూ ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అయితే కొందరు మాత్రం అల్లు అర్జున్ అని మాత్రమే సంబోధిస్తుంటే.. ఇంకొందరు మాత్రం ఐకాన్ స్టార్ అని పిలిచేస్తున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన పుష్ప ప్రెస్ మీట్లో బన్నీని దీనికి సంబంధించిన ప్రశ్నలే సంధించినట్టు తెలుస్తోంది.
ఆర్య సమయంలో సుకుమార్ తనకు స్టైలీష్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చాడట.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అని అన్నాడట.. అందుకే ఇలా ఐకాన్ అని తన పేరు ముందు పెట్టుకున్నానంటూ అసలు విషయం చెప్పాడు. అక్కడి వరకు బాగానే ఉంది. ఓవర్సీస్లో పుష్ప బుకింగ్స్ చూస్తుంటే బాక్సులు బద్దలయ్యేలేట్టు కనిపిస్తోంది. మొదటి రోజు, ప్రీమియర్స్ లెక్కలు కలిపితే వన్ మిలియన్ క్లబ్బులో చేరేట్టు కనిపిస్తోంది.
అయితే మీడియాతో మాట్లాడిన ఆయన బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నా.. కోలీవుడ్‌లో విజయం అందుకోవడమే తన కల అని అల్లు అర్జున్ అన్నారు. అల వైకుంఠపురములో’ సినిమా పూర్తయ్యాక ‘పుష్ప’ మొదలుపెట్టా. 45 రోజుల్లో పుష్పరాజ్‌గా మారా. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డా. మేకప్ వేసుకునేందుకు 2 గంటలు, దాన్ని తీసేందుకు 40 నిమిషాల సమయం పట్టేది. ఫహద్ ఫాజిల్ నటన అద్భుతం. ఆయన పెర్ఫామెన్స్కి ఫిదా అయిపోయారని అన్నాను.