in

Prabhas Gifts Expensive Watches To adhipurush team!

మ‌న హీరోలు ఈమ‌ధ్య ఓ మంచి సంప్ర‌దాయాన్ని ఫాలో అవుతున్నారు. సినిమా షూటింగ్ అవ్వ‌గానే… చిత్ర‌బృందానికీ, సాంకేతిక నిపుణుల‌కూ.. భారీ బ‌హుమానాలు ఇచ్చి వాళ్ల‌ని ఖుషీ చేస్తున్నారు. ఎందుకంటే తెర‌పై క‌నిపించేది హీరో, హీరోయిన్లే. కానీ ఆ సినిమా బాగా రావ‌డానికి అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డే టీమ్… తెర వెనుకే ఉండిపోతారు. వాళ్ల‌ని గుర్తించ‌డం క‌నీస ధ‌ర్మం. అందుకే అల్లు అర్జున్ `పుష్ప‌` టీమ్ కి.. బంగారు బిస్కెట్ల‌ని బ‌హుమానంగా ఇచ్చాడు. ఇప్పుడు ప్ర‌భాస్ కూడా అదే ఫాలో అయ్యాడు.

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా `ఆదిపురుష్‌` అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ చేస్తున్న స్ట్ర‌యిట్ హిందీ సినిమా ఇదే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్త‌యిపోయింది. ఈ సంద‌ర్భంగా ఆదిపురుష్ టీమ్ కి ఖ‌రీదైన బ‌హుమ‌తులు అందించాడు ప్ర‌భాస్‌. ఆరు ల‌క్ష‌లు ఖ‌రీదు చేసే రాడో వాచీల‌ను… టీమ్‌కి కానుక‌గా ఇచ్చాడ‌ట‌. ప్ర‌భాస్ చేతుల‌తో స్వ‌యంగా.. ఈ బ‌హుమ‌తులు అంద‌డంతో.. వాళ్లంతా ఖుషీ అయిపోతున్నారు. రాధే శ్యామ్ టీమ్‌ కి కూడా ఇలానే.. గిఫ్టులిచ్చి త‌న ప్రేమ‌ని తెలియ‌జేశాడు ప్ర‌భాస్‌.

jagan sarkar gives bumper offer to sankranti movies!

adah sharma stills in wedding outfit by yoshita couture!