in

Mahesh Babu to undergo knee surgery in Spain?

టగాళ్లకు, సినీ నటులకి సర్జరీలు కామన్. క్రీడాకారులు ఎక్కువగా గాయాల భారిన పడుతూ.. శస్త్ర చికిత్సలతో సహజీవనం చేస్తుంటారు. ఇక నటీనటులు ఏమో చాలావరకు గ్లామర్ కోసం సర్జరీలకు ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఇప్పుడున్న మన యువ స్టార్ హీరోలంతా తమ మొహాలకి ఏదొక చోట సర్జరీ చేస్కున్నవారే. అయితే ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన మోకాలికి సర్జరీ చేసుకున్నాడు. కొన్నాళ్లుగా మహేష్ మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్నారని,

పరిష్కారంగా సర్జరీ చేయాలని డాక్టర్స్ సూచించారని సదరు కథనాల సారాంశం. సర్జరీ అనంతరం మహేష్ రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందట. అందుకే ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ కూడా వాయిదా వేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా మొన్న మహేష్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించాడు. ఎప్పుడు ఫారిన్ టూర్స్ తో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే మహేష్ బాబు..

ఈ సారి కూడా అలాంటి హాలిడే ట్రిప్ అనుకున్నారంత. కానీ ఇప్పుడు తాజాగా సర్జరీ వార్తలు బయటకి రావటంతో మహేష్ ఆకస్మిక ప్రయాణం కూడా సర్జరీ కోసమే అని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలు నిజమే అని సమాచారం అందుతుంది. మహేష్ మోకాలికి స్పెయిన్ దేశంలో సర్జరీ జరిగిందట. ప్రస్తుతం ఆయన దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారట. మహేష్ భార్య నమ్రత సిస్టర్ శిల్పా శిరోద్కర్ దుబాయ్ లో నివాసం ఉంటున్నారు. అక్కడే కొన్ని రోజులు మహేష్ విశ్రాంతి తీసుకోనున్నట్లు వినికిడి.

Move Over Samantha, Faria Abdullah’s Special song in ‘Bangarraju’!

‘Shyam Singha Roy’ Trailer, Nani, Sai Pallavi, Krithi Shetty!