నాగ చైతన్య తో విఫల వివాహబంధం గురించి తొలిసారి పెదవి విప్పింది అగ్ర కథానాయిక సమంత. విడాకుల అనంతరం తాను మానసికంగా కృంగిపోయి చనిపోతాననుకున్నానని ..కానీ ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకొని ధైర్యంగా నిలబడ్డానని వ్యాఖ్యానించింది. తన సొంత బలాల్ని చూసి గర్విస్తున్నానని తెలిపింది. ‘ఏదైనా చెడు జరిగితే తొలుత ఆ సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. యథార్థాన్ని అంగీకరించాలి. అప్పుడు మనం విజయం సాధించినట్లే.
జీవితం ఎప్పటికీ ముగియని ఓ యుద్ధమని భావిస్తే ఏ సమస్యకు పరిష్కారం దొరకదు. జీవితానికి ఎదురీది పోరాడాల్సిందే. తొలుత నేను చాలా బలహీనురాలినని అనుకునేదాన్ని. కానీ జీవితంలోని కష్టాల్ని ఎదుర్కొన్నప్పుడే నాలోని బలాలేమిటో, నా శక్తిసామర్థ్యాలేమిటో తెలిసొచ్చాయి’ అని సమంత పేర్కొంది. ప్రస్తుతం ఆమె భారీ చిత్రాలపై దృష్టి పెడుతూ కెరీర్‌లో దూసుకుపోతున్నది. ఇటీవలే పాన్‌ఇండియా చిత్రం ‘యశోద’ సెట్స్‌మీదకు వెళ్లింది. గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.