in

happening beauty samantha spotted in akkineni’s compound!

టాలీవుడ్ భామ స‌మంత ఇటీవ‌లే అక్కినేని నాగ‌చైత‌న్య తో విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. విడాకుల త‌ర్వాత స‌మంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల‌తో బిజీగా మారేందుకు షెడ్యూల్ రెడీ చేసుకుంది. ఇప్ప‌టికే గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న శాకుంత‌లం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప‌లు హిందీ ప్రాజెక్టుల‌ను కూడా లైన్‌లో పెట్టింది సామ్‌. అయితే సమంత‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర వార్త ఒక‌టి ఫిలింన‌గ‌ర్‌లో రౌండ‌ప్ చేస్తుంది.

అక్కినేని నాగార్జున హోం బ్యాన‌ర్ అన్న‌పూర్ణ స్డూడియోస్ లో స‌మంత ప్ర‌త్యక్ష‌మైంద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంత‌కీ సామ్ స్టూడియోలోకి రావ‌డానికి కార‌ణమేంట‌నే క‌దా మీ డౌటు. తాజా అప్‌డేట్ ప్ర‌కారం శాకుంత‌లం డ‌బ్బింగ్ కోసం స్టూడియోలో ప్ర‌త్యక్ష‌మైన‌ట్టు టాలీవుడ్ స‌ర్కిల్ టాక్‌.. మొత్తానికి సామ్ ఇలా విడాకుల త‌ర్వాత మొద‌టిసారి స్టూడియోకు రావ‌డంపై అంద‌రూ తెగ చ‌ర్చించుకుంటున్నారు..స‌మంత మ‌రోవైపు విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కాతువాకుల రెండు కాధ‌ల్ చిత్రంలో న‌టిస్తోంది. న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Minister Compares local Roads To Katrina Kaif’s Cheeks!

Esha Gupta raises temperature by sharing this new pics!