in

Mahesh Babu waiting eagerly to have Genelia’s special food!

తెలుగులో ఒకప్పుడు జెనీలియా చేసిన సందడి అంతా ఇంతా కాదు. జెనీలియా చేసిన తెలుగు సినిమాల్లో చాలా వరకు మంచి విజయం సాధించాయి. ‘సై’, ‘హ్యాపీ’, ‘బొమ్మరిల్లు’, ‘ఢీ’, ‘ఆరంజ్’… లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకొని సినిమాలకి దూరం అయిపొయింది. సినిమాలకి దూరం అయినా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది.

తాజాగా జెనీలియా దంపతులు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ‘ఇమేజిన్ మీట్స్’ ఫుడ్ ఐటమ్స్ ని పంపించారు. దీనిపై మహేశ్ బాబు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ‘ఇమేజిన్ మీట్స్’ పంపించినందుకు కృతజ్ఞతలు. వీటిని వెంటనే టేస్ట్ చేయాలి అనే ఆత్రుతతో ఉన్నానని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. తన పట్ల అభిమానంతో పంపించినందుకు థ్యాంక్స్ చెబుతూ జెనీలియా, రితేష్ ని ట్యాగ్ చేశాడు.

‘Shyam Singha Roy’ Teaser, Nani, Sai Pallavi, Krithi Shetty!

super busy Pooja Hegde Cannot Wait for Pawan Kalyan!