జాతి రత్నాలు’ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ఫరియా అబ్ధుల్లా. మాంచి పొడుగరి అయిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే యూత్ మనసులు కొల్లగొట్టేసింది. యూత్‌లోనే కాదు, ఇండస్ర్టీని శైతం విశేషంగా ఆకర్షించింది. అయితే, కాస్త పొడుగు కావడంతో, పొడుగ్గా ఉన్న హీరోలకు మాత్రమే ఈ ముద్దుగుమ్మ జోడీ అవుతుందని భావించారంతా. ఆ కారణంగానే ‘జాతి రత్నాలు’ తర్వాత స్లోగా అమ్మడికి అవకాశాలు దక్కుతున్నాయి. లేటెస్టుగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించిన ఫరియా అబ్ధుల్లా మరో బంపర్ ఛాన్స్ కొట్టేసిందిప్పుడు.