in

national crush rashmika sets a new record on instagram!

తెలుగు సినిమా ల్లో మాత్రమే కాకుండా తమిళ , హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

రష్మిక టాలీవుడ్ , బాలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ గా మారారు.ఇదే సమయంలో రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో చూపిస్తున్న దూకుడు కూడా ఈమెను సౌత్ లో నెం.1 హీరోయిన్ గా మార్చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో రష్మిక కి 23.3 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్ లో స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్న ఏ హీరోయిన్ కు ఈ స్థాయి ఫాలోవర్స్ లేరు అనడంలో సందేహం లేదు.ఇతర హీరోయిన్స్ కూడా రష్మిక కు చాలా వెనుక ఉన్నారు. కనుక రాబోయే రోజుల్లో కూడా రష్మికనే సౌత్ లో నెం.1 స్టార్ హీరోయిన్ అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

gundamma katha loni paata venuka katha!

Shruti Haasan, Bhavana to Star in balakrishna’s next!