in

guruji Keeps His Promise To meenakshi chowdary!

టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్‌బాబు సినిమాలో హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ అంత సుల‌భంగా రాదనే సంగ‌తి తెలిసిందే. తాజాగా అప్‌క‌మింగ్ హీరోయిన్ ఒక‌రు అలాంటి బంప‌ర్ ఆఫ‌ర్‌నే కొట్టేసింద‌న్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ ఏడాది సుశాంత్‌తో క‌లిసి ఇచ‌ట వాహ‌న‌ములు నిలుపరాదు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది మోడ‌ల్‌ మీనాక్షి చౌద‌రి. ఈ హ‌ర్యానా సుంద‌రిని త్రివిక్ర‌మ్ మ‌హేశ్‌బాబుతో చేయ‌బోతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ఎంపిక చేశాడ‌ట‌.

ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక‌లో బిజీగా ఉంది త్రివిక్ర‌మ్ టీం. మెయిన్ హీరోయిన్ ఎవ‌ర‌నేది తెలియాల్సి ఉంది. మ‌హేశ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురాంతో చేస్తున్న స‌ర్కారు వారి పాట షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే త్రివిక్ర‌మ్ చిత్రాన్నిసెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు. ఒక్క సినిమాతోనే వ‌రుసగా భారీ ప్రాజెక్టుల్లో ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్‌నీల్ కాంబోలో వ‌స్తున్న స‌లార్ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

glamorous rashi khanna in backless yellow dress!

Kamal Haasan to launch his ‘House of Khaddar’ in USA!