in

Trisha’s Telugu Comeback With Webseries ‘Brinda’!

చెన్నై చంద్రం త్రిష‌ టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసింది.ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిష మెల్ల‌గా తెలుగు సినీ పరిశ్ర‌మ‌కు దూరం అయింది. కోలీవుడ్‌లోనే వ‌రుస సినిమాలు చేస్తూ సంద‌డి చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వ‌చ్చింది త్రిష‌. అయితే త‌మిళంలో ‘96’ త‌ర్వాత ఎన్నో సినిమాలు చేసిన‌ప్ప‌టికీ త్రిష‌కు మాత్రం ఆశించిన స్థాయిలో స‌క్సెస్ మాత్రం ద‌క్క‌లేదు. గ‌త ఏడాది ప‌రంప‌ద విళ‌యాట్టు సినిమాతో ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను త్రిష‌ ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే.

త్రిష దొరికిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌ర‌చుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘బృంద’ అనే తెలుగు వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది.ఇత‌ర భాష‌ల్లోనూ ఈ వెబ్ సిరీస్‌ను అనువదించ‌నున్నారు. స‌స్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. విజ‌య ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌ను కూడా ప్రారంభించారు.సూర్య వంగాల తెర‌కెక్కిస్తున్నఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో ప్రసారం కానుంది. ఇక మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్న ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’ సినిమాలో త్రిష ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అలాగే మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తోన్న ‘రామ్‌’ అనే చిత్రంలో ఆమె న‌టిస్తుంది.

Industrialist Surapaneni Clarifies PelliSandaD heroine Is Not His Daughter!

kabaddi title kaasta okkaduga yela maarindi!